నల్లధనం కేసుల్లో చట్టప్రకారం చర్యలు

ఢిల్లీ జ‌నంసాక్షి

నల్లధనం కేసుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. స్విస్ బ్యాంకుల్లోని 350 మంది ఖాతాలను మదింపు చేసి, 60 మంది ఖాతాదారులపై చార్జిషీట్లు నమోదు చేశామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా మిగతా ఖాతాల మదింపు పూర్తిచేస్తామని చెప్పారు. స్విస్ అధికారులతో మాట్లాడేందుకు గత అక్టోబర్ నెలలోనే ఒక బృందాన్ని పంపినట్టు జైట్లీ గుర్తుచేశారు.