నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: వరుసగా రెండు రోజులపాటు లాభాలు గడించిన భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న బలహీనత సెన్సెక్స్‌పై పడటంతో సూచీ 70.99 పాయింట్ల కోల్పోయి 17657.21 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 17.40 పాయింట్ల నష్టపోయి 5,362.95 వద్ద ముగిసింది.