నాగార్జన అగ్రికెం పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
ఎచ్చెర్ల : నాగార్జున అగ్రికెం పరిశ్రమను పున:ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ భారత స్వాభిమాన్ ట్రస్టు ఆందోళన చేపట్టింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో రోఉ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనతోపాటు ఆందోళనకు దిగిన ఐదుగురిని అరెస్టు చేశారు. పరిసర ప్రాంతాల తీవ్ర వ్యతిరేకత మధ్య భారీ బందోబస్తు పెట్టి పరిశ్రమను తిరిగి ప్రారంభించడం ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు.



