నాగార్జున అగ్రికెంలో కొనసాగుతున్న నిర్వీర్యం పనులు

శ్రీకాకుళం, జూలై 10 : నాగార్జున అగ్రికెం పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. తొలిత ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని, వారం రోజుల్లోగా రసాయనాలు నిర్వీర్యం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రసాయనాలు 8 గంటల నుంచి 32 గంటల వరకు ఏకదాటిగా పనులు జరిపితేనే చర్య పూర్తయి సురక్షిత స్థితికి చేరుకునేందుకు సాధ్యమవుతుందని ఏకదాటిగా 17 రోజులు పనిచేసేందుకు అనుమతులు ఇవ్వాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి ఈ నెల 14 వరకు వారం రోజుల పాటు ఏకదాటిగా పనులు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ ధనుంజయ మాట్లాడుతూ సురక్షితంగా మూసివేత పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయన్నారు. దీనికి 340 మంది కార్మికులు అవసరమని యాజమాన్యం తెలిపిందని, కార్మికుల కోరిక మేరకు ఈ వారం రోజుల్లో ఏదో సిప్ట్‌లో అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిరోజు రసాయనాల నిర్వీర్యానికి సంబంధించిన సమాచారాన్ని కలెక్టర్‌ నివేదిక అందిస్తామన్నారు.