నాచారం రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్‌ మార్కెట్‌యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను  అదుపులోకి తీసుకువచ్చారు. నష్టం విలువ అంచనా వేస్తున్నారు.