నాటు తుపాకీతో కాల్చుకుని ఇద్దరి మృతి

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకి కాల్చుకుని ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శివమ్మలు మృతిచెందారు. తమ అక్రమ సంబంధం భర్తకు తెలియడంతో భయంతో శివమ్మ, ఆమె ప్రియుడు రవి నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రవి ఘటనాస్థలంలోనే మృతిచెందగా, కొనప్రాణాలతో ఉన్న శివమ్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.