నిజామియాలో వసతులు మెరుగుపర్చండి

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : కలెక్టర్‌ తన ఛాంబర్‌లో మంగళవారంనాడు నిజామియా జనరల్‌ హస్సిటల్‌ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులతో హస్పిటల్‌, కాలేజీలలో మెరుగైన సదుపాయల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హస్పిటల్‌లో ప్రహారీ గోడ నిర్మాణం, పథలాజికల్‌ ల్యాబ్‌లో పరికరాలు కొనుగోలు, నీటి సరఫరా, లైబ్రరీ, లెక్చర్‌హాల్స్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు, ప్లంబింగ్‌ పనులు, హాస్పటల్లోని పురాతన భవనంలో మరమ్మతులు, కాలేజీలో బాలురకు టాయిలెట్లు, జిరాక్స్‌ మిషన్‌, జనరెటర్‌ మొదలగు సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని కమిటీ సభ్యులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా కేటాయించిన నిధుల మేరకు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తామని కలెక్టర్‌ వారికి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వము నుండి నిధులకు ఆమోదము లభించినందున పనులు ప్రారంభించుటకు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు లక్ష్మారెడ్డితో ఎస్టీమేషన్‌ తయారు చేయించి ఈ నెల 27లోగా సమర్పించాలని కోరారు. నిజామియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సయ్యద్‌ ఆరిఫుద్దీన్‌, చార్మినార్‌ ఎంఎల్‌ఎ మహమ్మద్‌ యావత్‌ అలీ, సిటి కాలేజీ ఇన్‌ఛార్జి పాల్గొన్నారు.