నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి): ప్రతి కళాశాలలోను రెండు రోజుల పాటు టాస్క్‌ఫోర్సు కమిటీ తనిఖీలు చేపట్టనున్నదని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌, ఇంజ నీరింగ్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను మార్కుల మెరిట్‌ ఆధారంగా కేటాయిం చాలన్నారు. ఎఐసిటిఇ నిబంధనలను ప్రతి ఇంజనీరింగ్‌ కళాశాల పాటించాల్సిందేన న్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఎఫ్‌ఆర్‌సి)కి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ట్టుగా నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అన్న దానిపై టాస్క్‌ఫోర్సు ప్రధానంగా దృష్టి పెడుతుందన్నారు. కళాశాలల్లో పనిచేసే టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ సిబ్బంది, ఉద్యోగుల జీతాల వివరాలను కళాశాల వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. అలాగే
విద్యార్థులకు కళాశాల కల్పిస్తున్న వసతులను కూడా వెబ్‌లో పొందుపరచాలన్నారు. రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలల్లో తనిఖీలను సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా కళాశాలలపై టాస్క్‌ఫోర్సు రూపొందించిన నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.