నిమజ్జనానికి తరలిన గణనాథుడు
మల్దకల్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని నల్లకుంట కమిటీ నందు జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడు పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.శుక్రవారం మూడోరోజు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం గణనాథుడిని ఘనంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమశేఖర్,పట్టణ అధ్యక్షుడు గిరి, సభ్యులు అంజి,వీరేష్,నరసింహ,లక్ష్మణ్,కృ ష్ణ,రాజు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.