నియమాలు పాటించని వాటర్‌ ప్లాంట్ల సీజ్‌

వేములవాడ రూరల్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : భద్రతా నియమాలు పాటించని వాటర్‌ ప్లాంట్లను మంగళ వారం అధికారులు సీజ్‌ చేశారు. వేముల వాడ మండలం తిప్పాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్లను ఆహార భద్రతాధికారులు తనిఖీ చేశారు. కనీస నియమాలు పాటించని రెండు వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆహారభద్రతాధికారి శ్రీథమ్‌కు మార్‌, ఏరియా ఆహార భద్రతాధికారి లక్ష్మినారాయణ, సంజీవ్‌, రవీందర్‌ పాల్గొన్నారు.