నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్‌-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం తెలిపారు. ఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు దారులు తమ బయోడేటాలతో కుల, ఆదాయ, మార్కుల సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజు పోటోలతో ఈ నెల 12న టీచర్స్‌ కాలనీలోని స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో అందజేయాలని కోట్లింగం తెలిపారు. మిగతా వివరాలకు కార్యాలయంలోని సిబ్బందిని సప్రందించాలని అన్నారు.