నిరుపేద విద్యార్థిని శ్రీ వల్లిక కి ఆర్థిక సహాయం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 04 (జనం సాక్షి): సింగరేణి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన విద్యార్థిని శ్రీ వల్లిక కు ఉన్నత చదువులకై పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం జి ఎం కార్యాలయంలో జిఎం.జక్కం రమేష్ చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యా దానం మిన్న ఉచితంగా విద్య బోధించటం చదువుకొనే వారికి సహాయం చేయటం కూడా విద్యాదానం అవుతుందన్నారు.
మణుగూరు ఏరియా సింగరేణి మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (ఎంవిటీసీ) వారి ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం కట్టం వారి గూడెం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని కట్టం శ్రీవల్లికకు ఉన్నత చదువులకై పది వేల రూపాయలు ఎస్ ఓ టు జి ఎం డి లలిత కుమార్ వెయ్యి రూపాయలు (మొత్తం 11 వేల రూపాయలు)ఆర్థిక సహాయం అందజేశారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మారుమూల గిరిజన గ్రామానికి చెందిన శ్రీ వల్లిక చదువుపై మక్కువతో మొక్కవోని దీక్షతో వరంగల్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నదని ఇటీవల నేషనల్ ఎడ్యుకేషనల్ సైన్స్ టెస్ట్ (నెస్ట్) ప్రవేశ పరీక్షలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఎస్టి క్యాటగిరీలో 23వ ర్యాంక్ ఓపెన్ క్యాటగిరిలో 1231 ర్యాంకు సాధించి దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఐదు సంవత్సరాల ఉన్నత విద్య కై సీటు సాధించిందని ఈనెల ఎనిమిదో తేదీ కాలేజీలో జాయిన్ కావాల్సిఉందని ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని తెలుసుకున్న ఎం వి టి సి అధికారులు సిబ్బంది శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సహకారం చేయటం అభినందనీయమని ప్రశంసించారు.ఇంకా కొంతమంది. దాతలు ముందుకొస్తే ఆ అమ్మాయి చదువు నిరభ్యంతరంగా కొనసాగుతోందని శ్రీవల్లిక చదువుకై దాతలు సహకరించాలని ఆయన కోరారు.,విద్యార్థిని శ్రీవల్లిక మాట్లాడుతూ తన చదువుకు సహకరించిన ఎం వి టి సి అధికారులకు సిబ్బందికి, ఎస్ ఓ టు జిమ్ లలిత్ కుమార్ కి ఎంతగానో రుణపడి ఉంటానని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎo డి లలిత కుమార్, కార్యక్రమ సమన్వయకర్తగా ఎం వి టి సి మేనేజర్ జి నాగేశ్వరరావు,జి లక్ష్మణ్, ఏరియా గుర్తింపు సంఘం నాయకులు కోట శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, ఎం వి టి సి శిక్షకులు భోగా శంకరయ్య, కీర్తి శ్రీనివాస్, సిబ్బంది, జిఎం పిఏ రాంబాబు,సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా , కట్టం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.