నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

నిలువ నీడ లేదు

నిలువ నీడ లేదు ... గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నకు మొక్కుకున్న తమ మొక్కుబడులు నెరవేర్చుకోవడానికి ఆదివారం సాయంత్రానికే వేములవాడకు చేరుకున్న వేలాది మంది భక్తులకు దేవస్థానానికి సంబంధించిన ఉన్న కొద్ది ధర్మశాలలు ఏ మూలకూ సరిపోక వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు గదులను ఆశ్రయించగా, ఆర్థిక స్థోమత లేని పలు కుటుంబాలు ఆలయ ప్రాంగణాలను, ఓపెన్‌ స్లాబ్‌తో పాటు ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడే సేదతీరారు.  సోమవారం నాడు వేకువ జామునే  ధర్మగుండానికి చేరుకున్న భక్తులు స్నానాలాచరించి వివిధ క్యూలైన్లలో బారులు తీరారు. కాగా కోడె మొక్కుబడుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌ ఎక్కడ ఉందో తెలియక తికమక పడ్డ  భక్తులు దర్శనాల క్యూలెన్లో నిలబడగా, రాజన్న దర్శనం చేసుకునే మరి కొందరు భక్తులు కోడెల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న మరి కొంత మంది భక్తులు అధికారులపై తమ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు లోపల మరో ఐదారు క్యూలైన్లు కనబడడంతో ఏ క్యూలైన్‌కు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు.  మిగతా 8లో వివిధ స్థలాల్లో ఏర్పాటు చేసిన మొక్కు బడి కౌంటర్లు  రాజన్న మొక్కుబడులు నెరవేర్చుకునే క్రమంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వివిధ మొక్కు బడి కౌంటర్లన్నీ ఒకే చోట లేకపోవడంతో భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కోడె మొక్కు బడికి ఒక చోట, ప్రత్యేక కోడె మొక్కుబడికి ఒక చోట, అభిషేకం, అన్నపూజ, పల్లకిసేవ, ఆకుల పూజ, పెద్దసేవ తదితర పూజలకు మరో చోట ఇలా ఒక్కో స్థలంలో ఒక్కో మొక్కుబడికి సంబం ధించి కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భక్తులు ఎవరినైనా సంప్రదిస్తామనుకున్నా అధికారులెవ రూ అందుబాటులో లేక పోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. – త్రాగునీరు లేక తల్లడిల్లిన భక్తులు :  సోమవారం సందర్భంగా రాజన్న ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు వివిధ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండగా వారికి కనీసం  త్రాగునీరు లభించక, క్యూలైన్ల నుండి బయటకు రాలేక పిల్లలు, మహి ళలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయారు. వేసవి సెలవుల సందర్భంగా గత రెండు నెలలుగా ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాది భక్తులు వస్తా రని తెలిసినప్పటికీ ఆలయంలో, పరిసర ప్రాంతా ల్లో కనీసం త్రాగునీరు ఏర్పాటు చేయని ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.20 లక్షల ఆదాయం- 30 వేల మంది భక్తులు… రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి సుమారు 30 వేలకుపైగా భక్తులు విచ్చేయడంతో ఆలయ ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలన్నీ కోలా హలంగా మారాయి. ఆలయంలో భక్తులు నెరవేర్చుకున్న వివిధ మొక్కుబడుల ద్వారా దేవస్థా నానికి సుమారు 20 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.