నీలం తుపానుతో భారీగా పంటనష్టం

అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. బలహీనవర్గాలకు చెందిన కాలనీలన్నీ జలమయమయ్యాయి. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.