నెల్లూరులో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీ

నెల్లూరు: ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలు పరిశీలించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో పలువురు రాజ్యసభ, లోకసభ సభ్యులు నెల్లూరులో సమావేశమయ్యారు. హోటల్‌ హరితాలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ సిబ్బందితో వీరు భేటీ అయి తీర ప్రాంత సమస్యలపై  చర్చించారు.