నెల్లూరు ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

నెల్లూరు: తడ సమీపంలో అర్టీసీ బస్సులో ప్రయాణికులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయక చర్యలు అందేలా చూడాలని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం ఆదేశించారు.