నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు

నెల్లూరు: నగర ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు వ్యవహారంపై జిల్లా కెలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి రవాణా అవుతున్న 250 యూనిట్ల రక్తాన్ని తెదేపా నేతలు పట్టుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్‌ అదనపు వైద్యాధికారిచే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.