నేటినుంచి బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
జగిత్యాల,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): బీర్‌పూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 26వరకు 12రోజుల పాటు బ్ర¬్మత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.15న సాయంత్రం స్వామి వారి ఊరేగింపు, రాత్రి కొండపైకి తీసుకురావడం, 16న సాయంత్రం 7గంటలకు స్వా మి వారి కల్యాణం, 17న అగ్ని ప్రతిష్ఠాపన, 18న క్షీరసాగర మదనం, 19న చందనోత్సవం, డోలోత్సవం, తెప్పోత్సవం, 20న పార్వేట ఉత్సవం, 21న వనమ¬త్సవం, 22న వేదసదస్సు, 23న దోపుకథ, 24న స్వామి వారి రథోత్సవం, 25న ఏకాంతోత్సవం, 26న స్వామివారి స్నపన తిరుమంజనంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా వేడుకలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.  బీర్‌ఫూర్‌ శివారులోని గుట్టపై వెలసిన స్వామివారి ఆలయ పరిసరాలు, కొండపై నుంచి ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తులను మైమరిపింపజేస్తాయి. ఏటా బ్ర¬్మత్సవాలకు కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్య లో భక్తులు తరలివస్తారు. బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్‌, ఆలయ చైర్మన్‌ చంద్రశేఖర్‌ రావు తెలిపారు. ఉత్సవాలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గుట్టపైన ఆలయానికి, గుట్ట కింద ఉన్న గోపురానికి ఇప్పటికే రంగులు వేసి అందంగా అలంకరించారు. మంచినిటి వసతి, కోనేరు లో కొత్తనీటిని అందుబాటులో ఉంచారు. గుట్టకింద ఆలయానికి రంగులు వేసి అలంకరించారు. పరిసరాల్లో చలువ పందిళ్లు వేశారు. సుమారు 100 ఎకరాల్లో దుకాణాల సముదాయానికి చదును చేయించారు. స్వామి వారి దర్శనానికి మెట్లదారిలో భక్తులు వెళ్లాలని సూచించారు. బ్ర¬్మత్సవాల్లో భాగంగా ఈ నెల 17న స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవం గా నిర్వహించనున్నారు. వేద పండితుల మధ్య ఉదయం ఆరాధనతో మొదలుకొని, హవనం, బలిహరణం, స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం చేయించుకునే భక్తులు ముందుగా రూ.516 చెల్లించి రసీదు పొందాలని అధికారులు తెలిపారు. ఈనెల 19న తెల్లవారుజామున 4గంటలకు రథోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల డిపో అధికారులు జిల్లా కేంద్రం నుంచి కొండగట్టు విూదుగా పూడూర్‌, నాచుపల్లి, కొడిమ్యాల నుంచి నల్లగొండ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో నుంచి నల్లగొండ వరకు అర్టీసి అధికారులు ప్రత్యే క బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

తాజావార్తలు