నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు పొందారు.మూడోరౌండ్‌లో సీటు లభించిన వారి జాబితాను సీసీబీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.వీరు 16వ తేదీలోగా నివేదించాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు ఏదైనా కారణాలతో ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో రిజిస్టర్‌ చేసుకొని వారికి 17 నుంచి 22 వరకు కొత్తగా ఛాయస్‌ ఫిల్లింగ్‌ చేసుకోవచ్చు.