నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. అనేక అంశాలపై ఢిల్లీ హైకమాండ్ నుంచి ఆయన క్లారిటీ తీసుకోనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మాత్రమే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉందని గతంలోనే హైకమాండ్ చెప్పడంతో దానిపై పెద్దగా ఫోకస్ చేయరు.

రాజకీయ పరిణామాలను…
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఢిల్లీ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా పలు కేసులకు సంబంధించి కూడా హైకమాండ్ నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఈ పర్యటనను గమనిస్తున్నారు.