నేతకాని మహర్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు.
బెల్లంపల్లి,సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల నేతకాని మహార్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా గట్టు బానేశ్, యూత్ అధ్యక్షునిగా దుర్గం మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా పెరుగు తిరుపతిని ఎన్నుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో నేతాని అని వస్తున్నందున సరి చేయాలని, దళితులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతంలోని దళితులకు 15% రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్ర రాజధానిలో నేతకాని భవనానికి స్థలం మరియు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి అర్హులందరికీ దళిత బంధు మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈకార్యక్రమంలో నాయకులు కలాలి వెంకటేష్, డోలె సురేష్, గట్టు రాజయ్య, గట్టు శివలింగు, రాజేష్, లింగయ్య, జాడి మల్లయ్య పాల్గొన్నారు.