నేతలు ప్రకటనలకు పరిమితమవుతున్నారు. డీఎల్‌

మైదుకూరు : శివుని ఆజ్ఞతో పాలకుల్లో కనువిప్పు కలిగి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి డీఎల్‌ రవాంద్రారెడ్డి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కడప జిల్లా కాజీపేటలోని నాదనాగేశ్వరకోన ఆలయాన్ని మంత్రి కుటుంబసమేతంగా సందర్శంచి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొన్ని జిల్లాలు వరదలతో, మరికొన్ని జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతుండగా.. నేతలు టీవీల్లో బొమ్మలు చూపించుకొని ప్రకటనలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. నాదనేగేశ్వర కోన అభివృద్థికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అన్నారు.