నేపాల్‌ మాజీ యువరాజు అరెస్టు

బ్యాంకాక్‌: నేపాల్‌ మాజీ యువరాజు పరాన్‌షాను మాదక ద్రవాలు కలిగివున్నాడనే ఆరోపణపై థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియవచ్చింది. అక్టోబరు 27న థాయ్‌లాండ్‌ ప్రముఖ విహారకేంద్రమైన పుకెట్‌లో పరాన్‌ను అదుపులోకి తీసుకొని అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్టు థాయ్‌ పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై నేపాల్‌ సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.