న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి):
కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు హేమాజీ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ద్వారా న్యాయవ్యవస్థలో ఇతరుల జోక్యం పెరిగి న్యాయవిద్య పూర్తిగా నిర్విర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశి న్యాయవాదులను మన దేశానికి నిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తుందని అన్నారు. కేంద్రం ఈ బిల్లును వెనెక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న సమ్మెను న్యాయవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.