న్యాయ విజ్ఞాన సదస్సు

పెద్దపల్లి, జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్‌సివిల్‌జడ్జ్‌ శ్రీలేఖ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈసంధర్భంగా ఆమే మాట్లాడుతు మహిళలు చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని ఆపద వచ్చినప్పుడు ఏఏ కేసులు ఉపయోగించుకోవాలో ఆమే తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.