న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం

ఖమ్మం న్యాయవిభాగం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల సమావేశం జూన్‌ 10న ఖమ్మం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు దాసరి జగదీశ్వరరావు  ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రధాన కార్యదర్శి నంచర్ల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.23 జిల్లాల న్యాయ శాఖ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పాల్గొంన సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఆర్‌.కాంతరావు ముఖ్య అతిధిగా. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ఎం.ఎం.సిద్దార్ధి విశిష్ట అతిధిగా హాజరవుతున్నారని తెలిపారు. ఇల్లెందు క్రాన్‌ రోడ్డులోని టీటీడీసీలో జరిగే సదస్సులో న్యాయశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆమోగయోగ్యమైన పరిష్కారాలను సూచించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంను చర్చించడానికి జూన్‌ 9 సాయంత్రం 5 గంటలకు ప్రారంభ సమావేశం టీటీడీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీనికి తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి తెలియజేశారు.