న్యూజనరేషన్ కళాశాలలో ర్యాగింగ్
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని న్యూజనరేషన్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేశారు. జూనియర్లకు , సీనియర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బ్యాట్లతో కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.