న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ విజయం

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగుల మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ నికోల్‌ 33, విలియంసన్‌ 15, మెక్‌కలమ్‌ 32, టేలర్‌ 26 పరుగుల చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లు అజ్మల్‌ నాలుగు, తన్వీర్‌ ఉమర్‌ గుల్‌, అఫ్రిది చెరో వికెట్‌ తీసుకున్నారు.