పంచాయతీ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది నిర్భంధం

మానకొండూరు: గట్టుదుద్దెనపల్లి గ్రామంలో అప్రకటిత విద్యుత్‌కోతలకు నిరసనగా నలుగురు విద్యుత్‌ సిబ్బందిని రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. రెండుగంటలపాటు లోపల ఉంచారు. రాత్రివేళల్లో విద్యుత్‌ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని విడిపంచారు. అధికారులతో మాట్లాడతామని ఆందోళనకారులకు నచ్చజెప్పి తాళం తీయించారు.