పండగలు మత సామరస్యానికి ప్రతీకలు.

– బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5 (జనంసాక్షి)
పండగలు మత సామరస్యానికి ప్రతీకలు అని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో వినాయక మండపాన్ని సతీసమేతంగా సందర్శించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించి ప్రత్యేక పూజలు చేశారు. అన్ని కులాల వారు, మతాల వారు భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి మెలిసి పండగ నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.