పండుగ సందర్భంగా పేకాట నిషేధం : ఎస్పీ దుగ్గల్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడడాన్ని జిల్లా వ్యాప్తంగా  నిషేధించడం జరిగిందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలలో ప్రత్యేక స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. జూదానికి అలవాటుపడి తమ ఆస్తులను పొగొట్టుకోవద్దని, దీపావళి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవడానికి , శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అందరూ సహకరించాలన్నారు. పేకాట ఆడుతున్న సమాచారాన్ని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 08462-227100,226100,226101,9440795452 ఫోన్‌ద్వారా  అందజేయాలని, పోలీసు వారికి సహకరించి, సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.