పట్టణంలో పోలీస్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డ్యూటీ

ఖమ్మం, జూన్‌ 12 (జనంసాక్షి):   పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు అధికంగా జరు గుతున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌ హౌస్‌ అఫీసర్లుగా ఉన్నప్పటికీ అసాంఘిక కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. పనిభారం అధికం కావడంతో పోలీసు సిబ్బందికి ఇబ్బందిగా తయారవుతుంది. వీటిపై అధ్యయనం చేసిన పోలీసు అధికారులు ఎన్‌పోర్సుమెంట్‌ డ్యూటీ అవసరమని నిర్ణయానికి వ చ్చారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు ఎన్‌పోర్సుమెంట్‌ డ్యూటీ చేయాలని నిర్ణ యించారు. గత 9 రోజులుగా ఎన్‌పోర్సుమెంట్‌ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఒక సర్కిల్‌ ఇన ్‌స్పెక్టర్‌ పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. వనటౌన్‌, టుటౌన్‌, త్రిటౌన్‌, అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఒక్కొక్క ఎస్సై 2 గంటల పాటు గస్తీ  నిర్వహిస్తారు. మద్యం దుకాణాల వద్ద గొడవలు, నాటుసారా అమ్మకాలు, వ్యభిచారం, జూదం, అమ్మాయిలను వేధించడం వంటి అంశాలపై దృష్టి సారించ నున్నారు. ఇలాంటి వారిని గుర్తించి కేసు నమోదు చేస్తున్నారు. 8గంటల తర్వాత సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, పై స్థాయి అధికారులకు కేసుల వివరాలు తెలుపుతారు.