పత్తి విత్తనాల కోసం డ్రా

చెన్నారావుపేట : ఖరీఫ్‌ సీజన్‌కు గాను పత్తి విత్తనా ల కోసం వ్యవసాయ శాఖ సూచనల మేరకు శనివా రం చెన్నారావుపేట మండల కేంద్రంలో పత్తి విత్తనా ల డ్రాను నిర్వహించారు. ఇందుకు గాను 145 ప్యా కెేట్లకు గాను 368 మంది రైతులు డ్రాలో పాల్గొన్నా రు. డ్రాసిస్టం ద్వారా విత్తనాలు రాని రైతులు నిరుత్సాహపడ్డారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసినా రైతులకు నిరాశ మిగలడంతో జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యవసాయశాఖ అధి కారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పత్తి రైతాంగానికి సరిపోయేంత విత్తనాల ను పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని స్పష్టం చేశారు.