పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) :
టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే తన అభిప్రాయాన్ని తెలపాడు. ఇక వివారాల్లోకి వెళితే మూడు వారాల శిక్షణ శిబిరంల కోసం సెహ్వాగ్‌ ఇంటర్నెషనల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సెలక్షన్‌ ట్రయ ల్స్‌ కార్యాక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ ఎదుటి వారిని గౌరవిస్తే మనకు గౌరవం లభిస్తుంద ని అన్నాడు. 500ల మంది చిన్నారులు పాల్గొన్న ఈ సెలక్షన్‌లో 60 మంది నైపుణ్యం కలిగిన క్రికెటర్లను సెహ్వాగ్‌ ఎంపిక చేశాడు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సెహ్వాగ్‌ స్వయంగా దగ్గరుండి చూసుకొన్నాడు. చిన్నారుల్లో అద్భుతమైన ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని వారిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యానని అన్నాడు. క్రికెట్‌ జీవితానికి సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చా. ప్రధానంగా రెండు విషయాలు వీళ్లు నేర్చుకోవాలి. ఒకటి కోచ్‌తో ఎప్పుడు వాదనకు దిగవద్దు. కేవలం చర్చించాలి. ఇక రెండోది మనం మంచి వ్యక్తిగా ఉంటే కచ్చితంగా గొప్ప క్రికెటర్‌గా ఎదుగొచ్చు అని సెహ్వాగ్‌ వివరించాడు. చిన్నారులు అడిగిన క్రికెట్‌ ప్రశ్నలు చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పాడు. నన్ను అప్పర్‌ ఫ్లిక్‌ షాట్లు ఆడమని అడిగారు. ఈ రెండు షాట్లను బాగా ఆస్వాదించారు. నేను క్రికెట్‌ నేర్చుకునే సమయంలో ప్రతిరోజు నాలుగు గంటల పాటు ప్రయాణం చేసి కేవలం 30 నిమిషాలు బ్యాట్‌ పట్టి ఆడేవాడినని అన్నారు. అది కూడా నేను మా కోచ్‌ ఫెవరేట్‌ స్టూడెంట్‌ని కావడంతో నాకు 30 నిమిషాలు బ్యాట్‌ లబి స్తే మిగిలిన వారు కేవలం 15 మాత్రం బ్యాట్‌ పట్టుకునేవాడినని తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరే సుకున్నాడు.