పదవి విరమణ చేసిన స్వామి గౌడ్‌

టీఎన్జీవో భవన్‌: టీఎన్‌జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్‌ మంగళవారం పదవి విరమణ చేశారు. నూతన అధ్యక్షునిగా దేవీ ప్రసాద్‌ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యగుల సమస్యలపై పొరాటాలు సాగిస్తామన్నారు.తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 30 లోగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించక పోతే జేఏసీ తల పెట్టిన తెలంగాణ మార్చ్‌ లో పాల్గొంటామని హెచ్చరించారు. ఆగష్టు రెండో వారంలో టీఎన్‌జీవో కార్యవర్గ సమావేశలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం 10వ పీఆర్సీ ప్రకటించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. 10వ పీఆర్‌ర్పీ ప్రకటించక పోతే సమ్మె చేయడానికి కూడా సిద్దంగా ఉన్నామని ఆయన తేల్చి చేప్పారు. తెలంగాణ కోసం చావరి దాకా పోరాటం చేస్తానని టీఎన్జీవోమాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్‌ తెలిపారు.