పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడుగా శ్రీనివాస్..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7
శంకరపట్నం మండల పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గాజుల శ్రీనివాస్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడారు. శంకరపట్నం మండలం వంకాయ గూడెం శివారులో గల మాధవ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో మండల పద్మశాలి సంఘం నిర్వహించి జిల్లా బాధ్యుల ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం మండల శాఖను ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షునిగా తనతోపాటు ఇతర గ్రామాలకు చెందిన మరికొంతమందితో మండల కమిటీని పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం జిల్లా నాయకులు ఎలుకపల్లి గ్రామ సర్పంచ్ కొండ గణేష్, వోడ్నాల సత్యనారాయణ, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు హనుమంతు, సంజయ్ కుమార్. రఘుపతి, శంకరయ్య, శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.