పనులు కల్పించాలని ధర్నా

తొర్రూరు, జూన్‌ 6 (జనంసాక్షి):
మండల కేంద్రములోని స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు తమకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు కల్పించాలని స్థానిక ఎంపీడీవో కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో రాంమోహన్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆసంఘం నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలలుగా మాకు పనులు కల్పించడం లేదని ఎన్నిసార్లు వినతిపత్రం సమర్పించిన సంబంధిత అధికారులు స్పందించడం లేదని వారు అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పనులు కల్పించాలని ఎంపీడివో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సుమారు 100 మంది పాల్గొన్నారు.మూర్తి,  అధ్యాపకుడు ర రవి, వీరభద్రయ్య, పరిపూర్ణచారి, నీలా వసుంధర తదితరలు పాల్గొన్నారు.