పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, డిసెంబర్‌ 7 : హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్‌ కులాల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రామాంతపూర్‌, బేగంపేటలలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్స్‌లో జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులకు 15 సీట్లు ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు 2007, జూన్‌ 1వ తేదీ నుంచి 2008మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. బయోడేటాతో పాటు ధృవీకరణపత్రాలతో ఈ నెల 17వ తేదీన ఖమ్మం డిఆర్‌డిఎ కాంప్లెక్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.