పరిస్థితి ఇలానే ఉంటే ఒలింపిక్స్‌ రద్దు చేస్తాం

share on facebook

 

 

` టోక్యో గేమ్స్‌ 2020 ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ

టోక్యో,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): వచ్చే ఏడాదికల్లా కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోతే, వాయిదా పడిన ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామని టోక్యో గేమ్స్‌ 2020 ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ స్పష్టంచేశారు. ఈ ఏడాది జులైలో ప్రారంభంకావాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ కరోనా దెబ్బతో వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్‌ను 2021 జులై 23 నుంచి నిర్వహించాని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది కూడా వైరస్‌ కట్టడి కాకపోతే, మరోసారి ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తారా? అని మోరీని అడగ్గా.. పై విధంగా స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వ్లెడిరచారు. గతంలో ప్రపంచ యుద్ధా సమయంలోనే ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయని, ఇప్పుడు ప్రపంచ దేశాన్నీ కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఒకవేళ వైరస్‌ను సమూంగా నియంత్రిస్తే వచ్చే ఏడాదే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని తెలిపారు. అథ్లెట్లు, క్రీడా సమాఖ్యు, టోర్నీ నిర్వాహకు నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఐఓసీ ఏడాదిపాటు వాయిదా వేసిందన్నారు. మరోవైపు, వచ్చే ఏడాదికైనా వైరస్‌ నియంత్రణలోకి వస్తుందా అనే దానిపై సందేహాు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. వచ్చే ఏడాదికల్లా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనగొనకపోతే అప్పటికి పరిస్థితు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. ఒలింపిక్స్‌ నిర్వహించొద్దని తాము చెప్పట్లేదని, వ్యాక్సిన్‌ కనుగొనకపోతే పరిస్థితు దారుణంగా ఉంటాయని మాత్రమే చెబుతున్నామని పేర్కొంది.

Other News

Comments are closed.