రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే మనమందరం భద్రంగా ఉంటాం

దండేపల్లి జనవరి 6 ( జనం సాక్షి) సమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూర్య తేజ పేర్కొన్నారు మంగళవారం మండలంలోని వెలగనూరు దండేపల్లి ఉన్నత పాఠశాలలో మాసోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడమే కాకుండా రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు 18 సంవత్సరాలు నిండని పిల్లలు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు జైలు శిక్ష నడిపిన వారికి నడిపిన వారికి ఇతర శిక్షలు పడతాయని పిల్లలు వాహనాలకు దూరంగా ఉండాలని కోరారు తల్లిదండ్రులు వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు స్వయంగా తండ్రికి హెల్మెట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటినుండి బాగా చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న ఉపాధ్యాయులు రజిని వెంకట మల్లు రాజమౌళి భూమన్న గంగన్న తదితరులు పాల్గొన్నారు

