పర్యాటక భవన్‌ను సందర్శంచిన చిరంజీవి

హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి తొలిసారిగా బేగంపేటలో ఉన్న రాష్ట్ర పర్యాటక భవన్‌ను సందర్శంచారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంతోపాటు రెయిన్‌బో ఆర్ట్‌ గ్యాలరీని ఆయన ప్రారంభించారు. పర్యాటక అభివృద్థిలో అన్ని రాష్ట్రాలూ తనకు సమానమేనని చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలను, ఎదుర్కొంటున్న సమస్యలను తనకు తెలియజేయాలని అధికారులను కోరారు. ప్రతి రాష్ట్రంలోనూ సంబంధిత మంత్రులతో భేటీ అయి భారత్‌ను ఉత్తమ పర్యాటక దేశంగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.