పవర్‌లూమ్‌ కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌, డిసెంబర్‌ 11 : పవర్‌లూమ్‌ కార్మికుడు శంకరయ్య అప్పుల బాధను తాళలేక మంగళవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని తారకానగర్‌లో నివాసముంటున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. ఇటీవలనే ఒక కుమార్తెకు వివాహం చేసి అప్పుల వలయంలో చిక్కుకున్నాడు. అతనికి వచ్చే జీతం చాలక అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు తెలిపారు. సిరిసిల్ల టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు