*పశువులకు వ్యాధి నివారణ టీకాలు!

లింగంపేట్ మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గురువారం గ్రామంలోని 785 పశువులకు వ్యాధి నిరోదిక టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు.పశువులకు ముద్ద చర్మ వ్యాధి రాకుండా వ్యాధి నివారణ టీకాలు పశువులకు ఇప్పివ్వాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి,వెటర్నరీ అసిస్టెంట్ రవి.గోపాల మిత్రలు మహమ్మద్ అజాసోద్దిన్,రమేష్, మల్లేష్,రైతులు పాల్గొన్నారు.