పసిగుడ్డుకు మహమ్మారి

share on facebook

` 23 రోజు పసికందుకు కరోనా పాజిటివ్‌
మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజు పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుద చేశారు. రెండు రోజు క్రిత్రం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్‌ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచే తాజాగా ఈ ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు కేసు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు తాజాగా ముగ్గురికి కరోనా సోకడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది చర్యు చేపట్టారు.

Other News

Comments are closed.