పాకిస్థాన్‌ జైళ్లలో భారత రక్షణ సిబ్బంది

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ జైళ్లలో 74 మంది భారత రక్షణరంగ సిబ్బంది ఖైదీలుగా ఉన్నట్లు భావిస్తున్నామని కేంద్రప్రభుత్వం గురువారం వెల్లడించింది. వీరిలో 54 మంది యుద్దఖైదీలేనని తెలిపింది. 1971 నుంచి వీరు ఆ దేశ జైళ్లలో ఉన్నారని పేర్కొంది. 74 మందితోపాటు మరో 314 మంది భారతీయులు అక్కడి చెరశాలల్లో మగ్గుతున్నారని తెలిపింది. ఖైదీలుగా ఉన్న భారత పౌరుల్లో 81 మంది మత్స్యకారులేనని తెలిపారు. పాకిస్థాన్‌ మాత్రం తమ అదుపులో భారత యుద్ధఖైదీలెవరూ లేరని చెబుతోందని అన్నారు.