పాకిస్థాన్‌ సైనికుడి అరెస్టు

పూంచి, జూలై 12  పాకిస్థాన్‌కు చెందిన ఓ యువసైనికుణ్ణి భారత సైనిక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ కూడా పహారా కాసిన సాయుధ దళాలకు 25 ఏళ్ల అరీఫ్‌అలీ అనే పాకిస్థాన్‌ సైనికుడు కంటపడ్డాడు. వెంటనే భారత సైనిక దళాలు అతణ్ణి అదుపులోకి తీసకున్నాయి. అరీఫ్‌ అలీ పాకిస్థాన్‌కు చెందిన ఫ్రాంటరీ కోర్స్‌ ఆర్మీ దళాలకు చెందిన వాడిగా గుర్తించారు. అతని వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు.