పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

మహదేవపూర్‌ జూన్‌ 12 (జనంసాక్షి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను డిప్యూటి డిఈవో భిక్షపతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహదేవపూర్‌ మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో మహ దేవపూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదు.  ఆదే విధంగా బాలికల పాఠశాలలో కూడ ఒక్కరు విధులకు హాజరు కాలేదని ఆయన తెలిపారు. వి ధులకు హజరు కాని వారికి వేసవి కాల వేతనం కోత జరుగుతుందని అన్నారు. మండలంలోని కాళే శ్వరంలోని పాఠశాలలో ఎంఈవో భూమయ్య మంగళవారం తనిఖీ చేశారు. కాళేశ్వరం చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడం జరిందని ఉపాధ్యాయులందరు విధులకు హజ రైనారని ఎంఈవో తెలిపారు.