పాఠ్య పుస్తకాలలో వందేమాతరం ఉండాల్సిందే

ఆదిలాబాద్‌, జూలై 23: విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో వందేమాతరం గీతం చేర్చాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు సుదర్శన్‌ పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులతో కలిసి సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు పైగా అవుతున్న ఇప్పటివరకు పూర్తిస్థాయిలో దుస్తులు, పాఠ్య పుస్తకాలు విద్యార్థులు పంపిణీ కాలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని అన్నారు. ససమ్యల సాధన కోసం ఉపాధ్యాయులతో చర్చించి భవిష్యత్‌ కార్యచరణను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.