పాతబస్తీలో 144వ సెక్షన్ సడలింపు
హైదరాబాద్: వారం రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితుల అనంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద 144 సెక్షన్‌ను పోలీసులు సడలించారు. చార్మినార్ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి తిరిగి ట్రాఫిక్‌కు అనుమతించారు. దీంతో వాహనాల రాకపోకలు ప్రారంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు ఈ ఉదయం నుంచి భాగలక్ష్మి ఆలయంలోకి పటిష్ఠ బందోబస్తు మధ్య భక్తుల్ని అనుమతిస్తున్నారు. అదనపు పోలీసు కమిషనర్ ట్రాఫిక్ సీవీ ఆనంద్, దక్షిణ మండల డీసీపీ అకున్ సభర్వాల్‌లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పాతబస్తీలోని ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో రెండు ఆలయాలను అల్లరిమూకలు ధ్వంసం చేయడంతో మళ్లీ కొంత మేర ఉద్రిక్త పరిస్థితుల్ని తలెత్తాయి. అయితే తక్షణం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితుల్ని చక్కదిద్దారు. ప్రస్తుతానికి పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. భద్రతా బలగాల్ని మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు.



