పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

 టిఎస్ పిఆర్టియు మండల  ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసులు

పానుగల్ సెప్టెంబర్ 01( జనం సాక్షి)

  సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ , పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినంగా  పాటిస్తూ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై,నిరసన వ్యక్తం చేశారు.  ప్రోగ్రెసివ్  రికగ్నైజ్డ్  టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల( బాలురు) మరియు బాలికల ఉన్నత పాఠశాలల యందు గురువారం రోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో  ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి, తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఎస్ పిఆర్టియు మండల  ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసులు మాట్లాడుతూ,  ప్రభుత్వం అనుసరిస్తున్న  కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాలు  కలుగుతున్నందున, ఇట్టి విధానాన్ని రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని  డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో  ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణు వర్ధన్ రెడ్డి  మరియు సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు  మద్దిలేటి టిఎస్ యుటిఎఫ్  పానుగల్లు మండల ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ ,సురేష్ మద్దిలేటి, విజయ్ కుమార్ నరసింహ, సుంకన్న, మల్లేష్ కుమార్ ,కిరణ్ కుమార్, చిన్న నాగన్న , రాజవర్ధనాచారి, మాధవాచారి, రవి ,కరుణ,పద్మ మరియు  ప్రతాప్ రెడ్డి  పాల్గొన్నారు.